తెలంగాణ షాదీ ముబారక్ పథకం

Submitted by shahrukh on Thu, 11/01/2024 - 14:31
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • తెలంగాణ షాది ముబారక్ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారుల వివాహానికి కింద ఇవ్వబడిన ఆర్థిక సహకారం అందజేయబడుతుంది :-
    • Rs. 1,00,116/- ఆర్థిక సహకారం. (ఒక లక్ష ఒక వ0ద పదహారు రూపాయలు)
Customer Care
  • తెలంగాణ షాది ముబారక్ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23390228.
  • తెలంగాణ షాది ముబారక్ పథకం హెల్ప్ లైన్ ఈమెయిల్ :- help.telanganaepass@cgg.gov.in.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ షాది ముబారక్ పథకం.
ప్రారంభించిన తేదీ 2 అక్టోబర్ 2014.
లాభాలు పెళ్లి ఖర్చులకు సరిపడా ఆర్థిక సహకారం.
ఆర్థిక సహకారం ఒకే దశలో Rs. 1,00,116/- ల ఆర్థిక సహకారం.
నోడల్ విభాగం వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం, తెలంగాణ.
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కొరకు ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ షాది ముబారక్ పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • షాది ముబారక్ పథకం తెలంగాణ ప్రభుత్వం వివాహానికి సరిపడా ఆర్థిక సహకారాన్ని అందజేసే పథకం.
  • ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ షాది ముబారక్ పథకాన్ని 2 అక్టోబర్ 2014న ప్రారంభించారు.
  • తెలంగాణలో పేద కుటుంబాలలోని అమ్మాయిల పెళ్లి కోసం ఆర్థిక సహకారాన్ని అందించడమే ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.
  • తెలంగాణ షాది ముబారక్ పథకం మొదట్లో, కేవలం Rs. 51,000/- ల ఆర్థిక సహకారం మాత్రమే అందజేసింది.
  • కానీ 2017 లో, ఆర్థిక సహకారం అందజేయబడు నగదును సవరించి Rs. 75,116/- కు పెంచారు.
  • 2018లో, తెలంగాణ షాది ముబారక్ పథకం కింద అందజేయబడే ఆర్థిక సహకారం నగదు మరల సవరించబడింది.
  • ప్రస్తుతానికి వధువులకు తమ పెళ్లి కోసం, తెలంగాణ షాది ముబారక్ పథకం కింద Rs. 1,00,116/- ఆర్థిక సహకారం అందజేయబడుతుంది.
  • తెలంగాణ షాది ముబారక్ పథకం కింద వివాహానికి అందజేసే ఆర్థిక సహకారం తెలంగాణలో 6 మైనారిటీ వర్గాలకు చెందిన అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది.
  • షాది ముబారక్ పథకానికి కింద ఇవ్వబడిన ఆరు మైనారిటీ వర్గాలకు చెందిన అమ్మాయిలు అర్హులు :-
    • ముస్లింలు.
    • సిక్కులు.
    • క్రిస్టియన్లు.
    • పార్సీలు.
    • జైనులు.
    • బుద్ధిష్టులు.
  • తెలంగాణ షాదీ ముబారక్ పథకం కింద వివాహం కొరకు ఆర్థిక సహకారాన్ని లబ్ధి పొందడానికి కుటుంబ సంవత్సర ఆదాయం Rs. 2,00,000/- మించి ఉండరాదు.
  • వివాహానికి సంబంధించిన ఆర్థిక సహకారం వధువు యొక్క తల్లి పేరు మీద అందజేయబడుతుంది.
  • అర్హత కలిగిన లబ్ధిదారులు తెలంగాణ షాది ముబారక్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో నింపి వివాహానికి సంబంధించిన ఆర్థిక సహకారాన్ని పొందడానికి అప్లై చేయవచ్చు.
  • షాది ముబారక్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

ఆర్థిక సహకారం

  • తెలంగాణ షాది ముబారక్ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారుల వివాహానికి కింద ఇవ్వబడిన ఆర్థిక సహకారం అందజేయబడుతుంది :-
    • Rs. 1,00,116/- ఆర్థిక సహకారం. (ఒక లక్ష ఒక వ0ద పదహారు రూపాయలు)

అర్హత

  • అమ్మాయి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
  • అమ్మాయి వయసు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి.
  • అమ్మాయిలు కింద ఇవ్వబడిన మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉండాలి :-
    • ముస్లిమ్స్.
    • సిక్కులు.
    • క్రిస్టియన్లు.
    • పార్సీలు.
    • జైనులు.
    • బుద్ధిష్టులు.
  • అమ్మాయి యొక్క సంవత్సర కుటుంబ ఆదాయం Rs. 2,00,000/- మించి ఉండరాదు.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ ప్రభుత్వం యొక్క షాదీ ముబారక్ పథకం ద్వారా వివాహానికి సరిపడా ఆర్థిక సహకారాన్ని పొందాలంటే, అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • వధువు ఫోటో.
    • వధువు వయసు ధ్రువీకరణ పత్రం.
    • వధువు ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి ఆధార్ కార్డు కాపీ.
    • వరుడి ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి బ్యాంకు పాస్ బుక్.
    • వధువు బ్యాంకు పాస్ బుక్.
    • ఆదాయ ధ్రువీకరణ పత్రం.

అప్లై చేసే పద్ధతి

  • అర్హత కలిగిన లబ్ధిదారులు వివాహానికి ఆర్థిక సహకారాన్ని పొందడానికి తెలంగాణ షాదీ ముబారక్ పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయవచ్చు.
  • తెలంగాణ షాది ముబారక్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఈ పాస్ పోర్టల్ లో లభిస్తుంది.
  • న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి.
  • తర్వాత కింద ఇవ్వబడిన వివరాలను తెలంగాణ షాది ముబారక్ పథకం రిజిస్ట్రేషన్ ఫామ్ లో నింపాలి :-
    1. వధువు వివరాలు
    • అందుబాటులో ఉన్న SSC లేదా దానికి సరిపడా వివరాలు.
    • వధువు పేరు.
    • తండ్రి పేరు.
    • పుట్టిన తేదీ.
    • ఆధార్ నంబర్.
    • చదువు సంబంధిత వివరాలు.
    • ఫోన్ నెంబర్.
    • క్యాస్ట్.
    • సబ్ కాస్ట్.
    • అనాధ వివరాలు (అవును or కాదు).
    • తల్లి పేరు.
    • తల్లి ఆధార్ నెంబర్.
    • వికలాంగులు (అవును or కాదు).
    2. ఆదాయ సర్టిఫికెట్ వివరాలు
    • మీసేవ నంబర్.
    • దరఖాస్తుదారుల పేరు.
    • తండ్రి పేరు.
    • జిల్లా.
    • మండలం.
    • మండల రెవెన్యూ అధికారి పేరు.
    • మొత్తం ఆదాయం.
    3. శాశ్వత అడ్రస్
    • అడ్రస్ లైన్ 1.
    • అడ్రస్ లైన్ 2.
    • జిల్లా.
    • మండలం.
    • ఊరు.
    • పిన్కోడ్.
    4. ప్రస్తుత అడ్రస్
    • ఒకవేళ శాశ్వత అడ్రస్ మరియు ప్రస్తుత అడ్రస్ ఒకటే అయితే ఇవ్వబడిన బాక్సులో చెక్ చేయండి.
    5. బ్యాంకు ఖాతా వివరాలు
    • ఖాతాదారుని పేరు.
    • జిల్లా.
    • బ్యాంక్ పేరు.
    • బ్యాంకు IFSC కోడ్/ బ్రాంచ్ పేరు.
    • బ్యాంకు ఖాతా నెంబర్.
    6. తల్లి బ్యాంకు ఖాతా వివరాలు
    • ఖాతాదారుని పేరు.
    • జిల్లా.
    • బ్యాంక్ పేరు.
    • బ్యాంకు IFSC కోడ్/ బ్రాంచ్ పేరు.
    • బ్యాంకు ఖాతా నెంబర్.
    8. వరుడి వివరాలు
    • అందుబాటులో ఉన్న SSC లేదా దానికి సరిపడా వివరాలు (అవును or కాదు).
    • వరుడు పేరు.
    • తండ్రి పేరు.
    • పుట్టిన తేదీ.
    • ఆధార్ నెంబర్.
    • చదువు సంబంధిత వివరాలు.
    • మతం.
    • క్యాస్ట్.
    • సబ్ కాస్ట్.
    • కుటుంబ ఆదాయం.
    • ప్రస్తుత వృత్తి.
    9. శాశ్వత అడ్రస్
    • అడ్రస్ లైన్ 1.
    • అడ్రస్ లైన్ 2.
    • జిల్లా.
    • మండలం.
    • ఊరు.
    • పిన్కోడ్.
    10. వివాహ వివరాలు
    • వివాహం తేదీ.
    • వివాహం జరిగిన చోటు.
    • వివాహం జరిగిన చోటు అడ్రస్.
    11. అప్లోడ్ చేయవలసిన పత్రాలు
    • వధువు ఫోటో.
    • వధువు వయసు ధ్రువీకరణ పత్రం.
    • వధువు ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి ఆధార్ కార్డు కాపీ.
    • వరుడు ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి బ్యాంకు పాస్ బుక్.
    • వధువు బ్యాంకు పాస్ బుక్.
  • తెలంగాణ షాది ముబారక్ పథకం అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయడానికి, క్యాప్చ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • సబ్మిట్ చేయబడిన అప్లికేషన్ సంబంధిత అధికారుల ద్వారా వెరిఫై చేయబడుతుంది.
  • వెరిఫికేషన్ తర్వాత, సంక్షేమ అధికారుల ద్వారా వధువు యొక్క తల్లి బ్యాంకు ఖాతాలోకి చెక్కు అందజేయబడుతుంది.
  • లబ్ధిదారులు తెలంగాణ షాది ముబారక్ పథకం ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ ను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

పథకం లక్షణాలు

  • అన్ని అప్లికేషన్లను వెరిఫై చేసే అధికారం తహసీల్దారుకు ఉంటుంది.
  • అందజేయబడ్డ దరఖాస్తులను తహసీల్దారు మొదటి వెరిఫికేషన్ కోసం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కి పంపిస్తారు.
  • ఫీల్డ్ ఎంక్వయిరీ ని నిర్వహించడం విలేజ్ రెవెన్యూ అధికారుల యొక్క బాధ్యత.
  • విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, తెలంగాణ షాది ముబారక్ పథకానికి లబ్ధిదారుల అర్హతను కింద ఇవ్వబడిన వివరాల ద్వారా చెక్ చేస్తారు :-
    • లొకేషన్/ అడ్రస్.
    • ఆదాయ పరిమితి 2 లక్షల కన్నా తక్కువ ఉండాలి.
    • ఆధార్ కార్డు వివరాలు.
    • క్యాస్ట్ సర్టిఫికెట్.
    • తల్లిదండ్రుల ఆదాయం.
    • లబ్ధిదారుల గత పెళ్లి వివరాలు. ఈ వివరాలు లోకల్ నివాసులు మరియు చుట్టుపక్కల వాళ్ల ద్వారా చెక్ చేయబడుతుంది.
    • బ్యాంకు ఖాతా నెంబర్, IFSC కోడ్.
    • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్.
  • ఈ వివరాలన్నీ వెరిఫై చేసిన తర్వాత, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దరఖాస్తును తమ వ్యాఖ్యలతో జతచేసి తసిల్దార్ కు పంపిస్తారు.
  • అప్పుడు తహసిల్దారు తమ రిమార్కులను అప్లోడ్ చేసి దరఖాస్తును డిజిటల్ సైన్ మరియు బయోమెట్రిక్ ద్వారా అప్రూవ్ చేస్తారు.
  • అప్లికేషన్ను సంబంధిత ఎమ్మెల్యే కూడా సైన్ చేస్తారు.
  • సైన్ చేసిన తర్వాత, దరఖాస్తు కాపీనీ ఆన్లైన్ సిస్టం లో చెక్కు క్లియరెన్స్ కోసం ఆన్లైన్ సిస్టంలో అప్లోడ్ చేస్తారు.
  • ఆర్థిక సహకారం అందజేసే చెక్కు కేవలం లబ్ధిదారుల తల్లి పేరు మీదనే తీసుకోబడుతుంది.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ షాది ముబారక్ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23390228.
  • తెలంగాణ షాది ముబారక్ పథకం హెల్ప్ లైన్ ఈమెయిల్:- help.telanganaepass@cgg.gov.in.

Matching schemes for sector: Marriage

SnoCMSchemeGovt
1 కళ్యాణ లక్ష్మి పథకంTelangana

Comments

స్థిరలంకె

వ్యాఖ్య

పథకం మొత్తాన్ని నా భార్య ఖాతాలో జమ చేయడానికి ఎంత సమయం పడుతుంది. నా దరఖాస్తు ఆమోదించబడింది, కానీ ఇప్పటికీ నాకు ఎలాంటి మొత్తం రాలేదు.

స్థిరలంకె

వ్యాఖ్య

నేను ఆంధ్ర ప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నేను ysr షాదీ తోఫా లేదా తెలంగాణ షాదీ ముబారక్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలా? దయచేసి మార్గనిర్దేశం చేయండి

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.