ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం

Submitted by shahrukh on Fri, 28/06/2024 - 14:37
ఆంధ్రప్రదేశ్ CM
Scheme Open
Highlights
  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కింద, 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతినెలకు 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
Customer Care
  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం యొక్క హెల్ప్ లైన్ నెంబర్, సంబంధిత అధికారుల చేత త్వరలో విడుదల చేయబడుతుంది.
పథకం వివరాలు
పథకం పేరు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2024.
లాభాలు నెలకు 1,500/- రూపాయల ఆర్థిక సహకారం
లబ్ధిదారులు రాష్ట్ర మహిళలు.
నోడల్ విభాగం ఈ వివరాలు ప్రస్తుతానికి తెలియదు.
సబ్స్క్రిప్షన్ పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే విధానం దరఖాస్తుదారులు ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ ఫామ్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

పరిచయం

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దరఖాస్తుదారులకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి “ఏపీ ఆడబిడ్డ నిధి పథకాన్ని” ప్రకటించింది.
  • ఈ పథకం కింద, ఆంధ్ర ప్రదేశ్ లోని అర్హులైన మహిళలు ప్రతి నెలకు 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని అందుకుంటారు.
  • ఈ పథకం కింద అందజేయబడే ఆర్థిక సహకారం, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి డిబిటి మోడ్ ద్వారా ప్రత్యక్షంగా జమ చేయబడుతుంది.
  • ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన “ఏపీ ఆడబిడ్డ నిధి పథకం” ను “ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం” అని కూడా అంటారు.
  • మీకందరికీ తెలిసిన విధంగా, ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ప్రకటించబడిన ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా, టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేయబడింది.
  • టిడిపి మరియు కూటమి పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించారు కాబట్టి, ఈ పథకం యొక్క లబ్ధిదారులు పథకం అమలు కొరకు వేచి చూస్తున్నారు.
  • ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే, దరఖాస్తుదారులు ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం మార్గదర్శకాలు మరియు అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి.
  • కానీ, పథకం ప్రకటించే సమయంలో, ఏపీ ప్రభుత్వం పథకం యొక్క ముఖ్యమైన వివరాలను తెలియజేయలేదు. పథకాన్ని అమలుపరిచిన తర్వాత వాటిని విడుదల చేసే అవకాశం ఉంది.
  • ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, పథకం యొక్క లాభాలు రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే వర్తిస్తాయి.
  • అదనంగా, మహిళా దరఖాస్తుదారుల వయసు 19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా బలపరచడమే ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • ఈ పథకం యొక్క లాభాలను పొందడానికి, దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫామ్ను ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి.
  • ఒకవేళ దరఖాస్తుదారులు ఇటువంటి ఆర్థిక సహకారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అమలుపరిచే ఇతర పథకాల ద్వారా పొందితే, ఈ పథకం నుండి మినహాయింపబడతారు.
  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం యొక్క వివరాత్మకమైన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇక్కడ అప్డేట్ చేస్తాము.
  • ఏపీ మహిళా ఆర్థిక సహకార పథకం లేదా ఆడబిడ్డ నిధి పథకం యొక్క లేటెస్ట్ అప్డేట్లను పొందడానికి, ఇక్కడ మా పేజ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కింద, 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతినెలకు 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.

అర్హత పరిస్థితులు

  • లబ్ధిదారులు ఏపీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా, ప్రతి నెలకు, 1500/- రూపాయల ఆర్థిక సహకారాన్ని పొందాలంటే, కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను తప్పనిసరిగా కలిగి ఉండాలి :-
    • ఈ పథకం రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.
    • మహిళా దరఖాస్తుదారుల వయస్సు 19 నుండి 59 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.
    • వేరే పథక లాభాలను పొందే మహిళలు ఈ పధకం లాభాలను పొందడానికి అర్హులు కారు.

అవసరమైన పత్రాలు

  • పథకం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే సమయంలో, లబ్ధిదారులైన మహిళలు కింద ఇవ్వబడిన పత్రాలను తప్పనిసరిగా అందించాలి. (లిస్టులో ఏమైనా మార్పులు ఉంటే ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది) :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • ఆదాయ ధ్రువీకరణ పత్రం.
    • పాన్ కార్డు.
    • వయసు ధ్రువీకరణ పత్రం.
    • ఆధార్ కార్డు.
    • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
    • క్యాస్ట్ సర్టిఫికెట్.

అప్లై చేసే పద్ధతి

  • అర్హత కలిగిన దరఖాస్తుదారులు “ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకానికి” అప్లై చేసుకోవచ్చు.
  • కానీ, ఈ పథకాన్ని ప్రకటించే సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ పద్ధతి ద్వారా లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ పద్ధతి ద్వారా అప్లై చేయాలో స్పష్టంగా తెలియపరచలేదు.
  • పథకం యొక్క అప్లికేషన్ వివరాలు దాని యొక్క మార్గదర్శకాలలో తెలియజేయబడుతాయి.
  • ఏపీ ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ను సబ్మిట్ చేసే సమయంలో, దరఖాస్తుదారులు చెల్లుబాటులో ఉన్న వారి వివరాలను మరియు పత్రాలను అందజేయాలి.
  • సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లకు పరిశీలన పరీక్ష చేయబడుతుంది. పరీక్షను క్లియర్ చేసిన అప్లికేషన్లు మాత్రమే పథకం యొక్క లాభాలను పొందుతాయి.
  • పథకం అప్లికేషన్ కు సంబంధించిన సాధారణ ప్రక్రియను ఇక్కడ తెలియజేశాము. వివరణాత్మకమైన అప్లికేషన్ వివరాలను విడుదల చేసిన వెంటనే ఇక్కడ అప్డేట్ చేస్తాము.

ముఖ్యమైన లింక్స్

  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్ ఫామ్ త్వరలో విడుదల చేయబడుతుంది.
  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు సంబంధిత అధికారుల చేత త్వరలో విడుదల చేయబడతాయి.
  • ఆడబిడ్డ నిధి పథకం అధికారిక వెబ్సైట్ వివరాలు ఇంకా తెలియజేయాల్సి ఉంది.

సంప్రదింపు వివరాలు

  • ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం యొక్క హెల్ప్ లైన్ నెంబర్, సంబంధిత అధికారుల చేత త్వరలో విడుదల చేయబడుతుంది.

Matching schemes for sector: Fund Support

Sno CM Scheme Govt
1 ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ చేయూత పథకం ఆంధ్రప్రదేశ్
2 ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాపు నేస్తం పథకం ఆంధ్రప్రదేశ్
3 YSR EBC Nestham Scheme ఆంధ్రప్రదేశ్
4 Jagananna Chedodu Scheme ఆంధ్రప్రదేశ్
5 YSR Nethanna Nestham Scheme ఆంధ్రప్రదేశ్
6 YSR Vahana Mitra Scheme ఆంధ్రప్రదేశ్
7 Jagananna Thodu Scheme ఆంధ్రప్రదేశ్
8 ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం ఆంధ్రప్రదేశ్
9 Andhra Pradesh Thalliki Vandanam Scheme ఆంధ్రప్రదేశ్

Matching schemes for sector: Fund Support

Sno CM Scheme Govt
1 Pradhan Mantri Awas Yojana(PMAY) – Housing for All CENTRAL GOVT

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format