ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

Submitted by shahrukh on Fri, 28/06/2024 - 15:40
ఆంధ్రప్రదేశ్ CM
Scheme Open
Highlights
  • ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం కింద, ప్రభుత్వం కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి 3000/- రూపాయల నిరుద్యోగ భృతి అందజేయబడుతుంది.
    • ఈ లాభాలు ప్రతినెల అందజేయబడతాయి.
Customer Care
  • ఏపీ నిరుద్యోగ భృతి పథకం సంప్రదింపు వివరాలు (ఇంకా అందుబాటులో లేవు).
పథకం వివరాలు
పథకం పేరు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2024.
లాభాలు 3,000/- రూపాయల భృతి
లబ్ధిదారులు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత
నోడల్ విభాగం ఇంకా ప్రకటించలేదు
సబ్స్క్రిప్షన్ పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి
అప్లై చేసే విధానం అప్లై చేసే విధానం వివరాలు ఇంకా అందుబాటులో లేవు.

పరిచయం

  • ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రకటించింది.
  • ఈ లబ్ధిదారుల పథకం కింద, రాష్ట్రంలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ప్రతినెల భృతిని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.
  • ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రతినెల 3000/- రూపాయల భృతి పొందుతారు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సహకారాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి, డిబిటి మోడ్ ద్వారా ప్రత్యక్షంగా జమ చేస్తుంది.
  • నిరుద్యోగ యువత, ఉద్యోగం కొరకు ప్రయత్నించే సమయంలో, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చాలాసార్లు చూసి ఉంటాం.
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇబ్బందిని గుర్తించి, ఇటువంటి యువతపై ఉండే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వారు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
  • దీనిని అధిగమించడానికి, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రకటించింది.
  • 2019 లో, ముఖ్యమంత్రి యువ నేస్తం అని పిలవబడే ఇలాంటి పథకాన్ని టిడిపి ప్రారంభించి, ప్రతినెలకు 1,000/- లాభాన్ని నిరుద్యోగ యువతకు అందజేసింది.
  • ఏపీ నిరుద్యోగ భృతి పథకం అనేది టిడిపి మరియు కూటమి పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక భాగం అని మేము మరొకసారి గుర్తు చేయదలచుకున్నాము.
  • అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయం పొందిన తర్వాత, N. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు పరచడానికి సిద్ధమయ్యారు.
  • పథకాన్ని అమలు పరచడం ప్రారంభించిన తర్వాత, అర్హత కలిగిన లబ్ధిదారులు అప్లై చేసుకోవచ్చు.
  • కాకపోతే, ఏపీ నిరుద్యోగ ఆర్థిక సహకార పథకం అప్లికేషన్ ఫామ్ వివరాలు ఇంకా తెలియజేయాల్సి ఉంది.
  • పథకం లాభాలను పొందాలంటే, లబ్ధిదారులు తప్పనిసరిగా పథకం మార్గదర్శకాలలో ఉండే అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చదువుకున్న మరియు నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రమాణం చేసింది.
  • అప్పటివరకు, ఈ పథకానికి అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ పథకం యొక్క లాభాలను పొందవచ్చు.
  • రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు సెక్టార్ ఉద్యోగాలకు ప్రయత్నించే యువత సుమారుగా 15 లక్షల మంది ఉన్నారు. వారందరూ ఈ పథకం యొక్క లాభాలను పొందుతారు.
  • ప్రస్తుతానికి ఈ పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియదు. ఎప్పుడైతే ప్రభుత్వం మరిన్ని వివరాలను అందిస్తుందో, వాటిని మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.
  • ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం యొక్క లేటెస్ట్ అప్డేట్లను పొందడానికి, పాఠకులు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

పథకం లాభాలు

  • ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం కింద, ప్రభుత్వం కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి 3000/- రూపాయల నిరుద్యోగ భృతి అందజేయబడుతుంది.
    • ఈ లాభాలు ప్రతినెల అందజేయబడతాయి.

అర్హత పరిస్థితులు

  • ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం యొక్క లాభాలు కింద ఇవ్వబడిన అర్హత పరిష్కారం కలిగి ఉన్న వారికి అందజేయబడతాయి. కాకపోతే, ఇక్కడ ఇవ్వబడిన మార్గదర్శకాలు తాత్కాలికమైనవి మరియు మారవచ్చు :-
    • అతను/ ఆమె ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
    • దరఖాస్తుదారుల వయస్సు 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి.
    • బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లమా సర్టిఫికెట్ను పూర్తి చేసి ఉండాలి.
    • వారిపై ఎటువంటి క్రిమినల్ చార్జీలు బుక్ చేసి ఉండకూడదు.
    • నిరుద్యోగులై ఉండాలి.
    • బిపిఎల్/ వైట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి.
    • పిఎఫ్ అకౌంట్ ని కలిగి ఉండకూడదు.

అవసరమైన పత్రాలు

  • “ఏపీ నిరుద్యోగ భృతి పథకం” కు అప్లై చేసే సమయంలో, అర్హత కలిగిన లబ్ధిదారులు, కింద ఇవ్వబడిన పత్రాలను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి :-
    • ఆధార్ కార్డు.
    • ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్.
    • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • క్యాస్ట్ సర్టిఫికెట్.
    • అకాడమిక్ సర్టిఫికెట్.
    • నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఇతర పత్రాలు.

అప్లై చేసే పద్ధతి

  • ఏపీ నిరుద్యోగ భృతి పథకానికి అప్లై చేయడానికి లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఫామ్ చేయాలి.
  • కాకపోతే, పథకాన్ని ప్రకటించి సమయంలో, పథకానికి అప్లై చేసే పద్ధతి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చేయాలో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయలేదు.
  • పథకం యొక్క అప్లికేషన్ పద్ధతి పథకం మార్గదర్శకాలలో త్వరలో తెలియజేయబడుతుంది.
  • పథకంఅప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి, దరఖాస్తుదారులు వారి వివరాలను మరియు పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.
  • పథకం యొక్క వివరణాత్మకమైన అప్లికేషన్ పద్ధతి మాకు తెలియగానే, ఇక్కడ అప్డేట్ చేస్తాము.

ముఖ్యమైన లింక్స్

  • ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం మార్గదర్శకాలు (త్వరలో అందుబాటులోకి వస్తాయి)
  • ఏపీ నిరుద్యోగ భృతి పథకం అప్లికేషన్ లింక్. (అందుబాటులో లేదు)

సంప్రదింపు వివరాలు

  • ఏపీ నిరుద్యోగ భృతి పథకం సంప్రదింపు వివరాలు (ఇంకా అందుబాటులో లేవు).

Matching schemes for sector: Fund Support

Sno CM Scheme Govt
1 ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ చేయూత పథకం ఆంధ్రప్రదేశ్
2 ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాపు నేస్తం పథకం ఆంధ్రప్రదేశ్
3 YSR EBC Nestham Scheme ఆంధ్రప్రదేశ్
4 Jagananna Chedodu Scheme ఆంధ్రప్రదేశ్
5 YSR Nethanna Nestham Scheme ఆంధ్రప్రదేశ్
6 YSR Vahana Mitra Scheme ఆంధ్రప్రదేశ్
7 Jagananna Thodu Scheme ఆంధ్రప్రదేశ్
8 ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం ఆంధ్రప్రదేశ్
9 Andhra Pradesh Thalliki Vandanam Scheme ఆంధ్రప్రదేశ్

Matching schemes for sector: Fund Support

Sno CM Scheme Govt
1 Pradhan Mantri Awas Yojana(PMAY) – Housing for All CENTRAL GOVT

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format