హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
CENTRAL GOVT CM
Scheme Open
Highlights
  • భారత ప్రభుత్వం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద భారత నివాసులకు కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • 50 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వబడును.
    • 3% నుంచి 6% వరకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇవ్వబడును.
Customer Care
  • భారత ప్రభుత్వం, అతి త్వరలో, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం సంప్రదింపు వివరాలను తెలియజేస్తుంది.
పథకం వివరాలు
పథకం పేరు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2023.
లాభాలు
  • Rs. 50 లక్షల వరకు హౌసింగ్ లోన్.
  • 3% నుంచి 6% వరకు వడ్డీపై సబ్సిడీ.
లబ్ధిదారులు భారతదేశ నివాసులు.
నోడల్ విభాగం ఇంకా తెలియదు.
సబ్స్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే విధానం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం అప్లికేషన్ ఫామ్ ద్వారా.

పరిచయం

  • భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆగస్టు 15, 2023న అర్బన్ ఏరియాలలో నివసిస్తున్న పేద మరియు మధ్య తరగతి ప్రజల కోసం హౌసింగ్ స్కీం ను ప్రకటించారు.
  • ప్రధానమంత్రి ఈ కొత్త హౌసింగ్ స్కీం అమలు పరిస్థితులను చర్చించడానికి, అక్టోబర్ 8, 2023న, క్యాబినెట్ మీటింగ్ ను నిర్వహిస్తారు.
  • భారత ప్రభుత్వ కొత్త హౌసింగ్ స్కీం పేరే “హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం.”
  • ఈ పథకాన్ని “హౌసింగ్ సబ్సిడీ స్కీం ఫర్ అర్బన్ ఏరియాస్”, లేదా “ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీం ఆన్ హౌసింగ్ లోన్”, లేదా “ ఆవాస్ రిం పర్ సబ్సిడీ యోజన” అని కూడా అంటారు.
  • ఇప్పుడు, సొంతిల్లు లేని భారతదేశ నివాసులకు సొంతిల్లు కలిగే కల సాకారమవుతుంది.
  • భారత ప్రభుత్వం, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద, 50 లక్షల రూపాయల హౌసింగ్ లోను అందజేస్తుంది.
  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద అందజేయబడిన లోన్ అమౌంట్ను లబ్ధిదారులు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి లేదా కొత్త ఇంటిని వారికి ఉన్న భూమిలో నిర్మించడానికి ఉపయోగించుకోవచ్చు.
  • అర్హత కలిగిన లబ్ధిదారులకు 3% నుంచి 6% వరకు బ్యాంక్ వడ్డీ మీద సబ్సిడీ కూడా ఇవ్వబడును.
  • లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ పథకం కింద బ్యాంకు సబ్సిడీ ప్రత్యక్షంగా తమ బ్యాంకు ఖాతాలలో అందజేయబడును.
  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం దీపావళి శుభ సందర్భంగా, దీపావళి రోజున ప్రారంభించబడుతుంది.
  • భారత ప్రభుత్వం హౌసింగ్ లోన్ పథకం కోసం 60,000/- కోట్ల రూపాయలను వెచ్చించడానికి సిద్ధంగా ఉంది.
  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం చావల్స్, పెంకుటిల్లులు, మరియు అద్దె ఇండ్లలో నివసించే పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కు సహాయం చేయడానికి ప్రారంభించబడింది.
  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. త్వరలో అప్లై చేసే పద్ధతి మరియు అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయబడతాయి.
  • భారత ప్రభుత్వ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.

పథకం లాభాలు

  • భారత ప్రభుత్వం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద భారత నివాసులకు కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • 50 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వబడును.
    • 3% నుంచి 6% వరకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇవ్వబడును.

Housing Loan Interest Subsidy Scheme India Benefits

అర్హత

  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద, హౌస్ లోన్ సబ్సిడీ లాభాలను పొందాలంటే, భారత ప్రభుత్వం కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను కలిగి ఉండాలని తెలియజేసింది :-
    • దరఖాస్తుదారులు భారత నివాసులై ఉండాలి.
    • దరఖాస్తుదారులు అర్బన్ ఏరియాస్ లో నివసిస్తూ ఉండాలి.
    • దరఖాస్తుదారులు, చావుల్స్, పెంకుటిల్లులో లేదా అద్దెకు నివసిస్తున్న వారై ఉండాలి.
    • మిగిలిన అర్హత పరిస్థితులు త్వరలో తెలియజేయబడతాయి.

అవసరమైన పత్రాలు

  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం కింద లాభాలను పొందడానికి, అప్లై చేసే పద్ధతిలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • ఆధార్ కార్డు.
    • కాస్ట్ సర్టిఫికెట్. (సంబంధించిన వారికి)
    • ఇన్కమ్ సర్టిఫికెట్.
    • మొబైల్ నెంబర్.
    • భూమి పత్రాలు. (సంబంధించిన వారికి)

అప్లై చేసే విధానం

  • భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, హౌసింగ్ లో ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకాన్ని 2023 స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రకటించారు.
  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 8, 2023న ఈ పథకం అమలు పరచడానికి పరిస్థితులను చర్చించడానికి క్యాబినెట్ మీటింగ్ ను జరుపుతారు.
  • హౌసింగ్ లోన్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించడానికి, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రపోజల్ కు, ఎక్స్పెండిచర్ ఫైనాన్షియల్ కమిటీ అంగీకారాన్ని తెలిపిందని అధికారులు తెలియజేశారు.
  • అతి త్వరలో, పథకం యొక్క అప్లై చేసే పద్ధతి మరియు అధికారిక మార్గదర్శకాలను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది.
  • కానీ, హౌసింగ్ లోన్ పథకం పేరును బట్టి, అప్లికేషన్ పద్ధతి బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఉంటుందని అర్థమవుతుంది.
  • భారత ప్రభుత్వ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.

ముఖ్యమైన లింక్స్

  • హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం అప్లై చేసే విధానం మరియు అధికారిక మార్గదర్శకాలను భారత ప్రభుత్వం అతి త్వరలో తెలియజేస్తుంది.

సంప్రదింపు వివరాలు

  • భారత ప్రభుత్వం, అతి త్వరలో, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పథకం సంప్రదింపు వివరాలను తెలియజేస్తుంది.
Person Type Govt

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format