మేరా బిల్ మేరా అధికార పథకం

Submitted by shahrukh on Sat, 02/03/2024 - 13:10
CENTRAL GOVT CM
Scheme Open
मेरा बिल मेरा अधिकार योजना लोगो।
Highlights
  • మేర బిల్ మేరా అధికార్ పథకం ద్వారా ఎంపిక చేయబడ్డ లక్కీ విన్నర్స్ కింద ఇవ్వబడిన ప్రైస్ లను పొందవచ్చు :-
    • నేషనల్ లెవెల్ విన్నర్స్ కు 1 కోటి రూపాయల విలువ గల 2 బంపర్ ప్రైసులు ఇవ్వబడును. (మూడు నెలలకు ఒకసారి)
    • Rs. 10,00,000/- విలువ గల 10 ప్రైజులు ప్రతి రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతానికి ఇవ్వబడును.
    • Rs. 10,000/- విలువ గల 800 ప్రైస్ లు ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి ఇవ్వబడును.
Customer Care
  • గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ హెల్ప్ లైన్ నెంబర్ :- 18001034786.
పథకం వివరాలు
పథకం పేరు మేరా బిల్ మేరా అధికార పథకం.
ప్రారంభించిన తేదీ 1st సెప్టెంబర్ 2023.
లాభాలు Rs. 10,000/- నుండి Rs. 1 కోటి రూపాయల వరకు క్యాష్ ప్రైసెస్
లబ్ధిదారులు భారత పౌరులు.
నోడల్ విభాగం ఆర్థిక మంత్రిత్త్వ శాఖ.
సబ్క్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి

పరిచయం

  • గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ని భారత దేశంలో అమలుపరచిన తర్వాత, భారత ప్రభుత్వ రెవెన్యూ పెరిగింది.
  • కానీ భారతదేశంలోని చాలా ప్రదేశాలలో, ట్రేడర్స్ మరియు షాప్ కీపర్ నుండి భారత దేశ పౌరులు బిల్లును సేకరించడం లేదు.
  • షాప్ కీపర్ల నుండి GST బిల్లులను సేకరించడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి, భారతదేశ ప్రభుత్వం “మేరా బిల్ మేరా అధికార పథకాన్ని” ప్రారంభించింది.
  • భారత ప్రభుత్వం మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని సెప్టెంబర్ 1st, 2023న ప్రారంభించింది.
  • ఈ పథకాన్ని, “మేరా బిల్ మేరా అధికార్ యోజన” లేదా “మై బిల్ మై రైట్ పథకం” అని కూడా అంటారు.
  • మొట్టమొదటగా, మేరా బిల్ మేరా అధికార పథకం కింద ఇవ్వబడిన 3 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుపరచబడుతుంది :-
    • హర్యానా.
    • అస్సాం.
    • గుజరాత్.
    • దాదర్ నగర్ హవేలీ.
    • డామన్ అండ్ దయు.
    • పుదుచ్చేరి.
  • ఆ తరువాత, మేరా బిల్ మేరా అధికార పథకం ఇతర రాష్ట్రాలలో కూడా అమలుపరచబడుతుంది.
  • భారత ప్రభుత్వం, లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డ లక్కీ విన్నర్స్ కు Rs. 10,000/- నుంచి Rs. 1 కోటి రూపాయల వరకు క్యాష్ ప్రైసెస్ ను అందజేస్తుంది.
  • భారత ప్రభుత్వం మేరా బిల్ మేరా అధికార పథకం ద్వారా, ప్రతినెలా లక్కీ విన్నర్ ను ఎంపిక చేస్తుంది.
  • నేషనల్ లెవెల్లో ఎంపిక చేయబడ్డ విన్నర్ కు, Rs.1 కోటి రూపాయల విలువగల రెండు బంపర్ ప్రైసులు ఇవ్వబడతాయి.
  • బంపర్ ప్రైస్ లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వబడతాయి.
  • 10 లక్షల రూపాయల విలువ గల, 10 ప్రైస్ లు రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన, ఎంపిక చేయబడ్డ విన్నర్స్ కు ఇవ్వబడతాయి.
  • Rs. 10,000/- విలువ గల 800 ప్రైస్ లు, రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన, ఎంపిక చేయబడ్డ విన్నర్స్ కు, మేరా బిల్ మేరా అధికార పథకం ద్వారా ఇవ్వబడతాయి.
  • మేరా బిల్ మేరా అధికార పథకం ద్వారా ఎంపిక చేయబడ్డ లక్కీ డ్రా ప్రతినెల 15వ తేదీన ప్రకటించబడుతుంది.
  • ఈ పథకం కింద ప్రైస్ లను పొందాలంటే, లబ్ధిదారులు ప్రతిసారితమ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుగోలుపై వచ్చిన GST బిల్లులను సేకరించాలి.
  • లబ్ధిదారులు, ఈ GST బిల్లులను, మేరా బిల్ మేరా అధికార పోర్టల్ ద్వారా లేదా మేరా బిల్ మేరా అధికార్ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాలి.
  • ప్రతి లబ్ధిదారులు నెలకు, 25 GST బిల్లులను అప్లోడ్ చేయవచ్చు.
  • ప్రతి నెల 15వ తారీఖున లక్కీ డ్రా ద్వారా, విన్నర్స్ ని ఎంపిక చేస్తారు.
  • మేరా బిల్ మేరా అధికార పథకం విన్నర్స్ తమ మొబైల్ ఫోన్కు వచ్చే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • మేరా బిల్ మేరా అధికార పథకం ద్వారా క్యాష్ ప్రైస్ ను పొందాలంటే, పాన్ కార్డు తప్పనిసరి.
  • క్యాష్ ప్రైస్ అమౌంట్, ప్రత్యక్షంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పంపబడతాయి.

Mera Bill Mera Adhikaar Scheme Information

పథకం లాభాలు

  • మేర బిల్ మేరా అధికార్ పథకం ద్వారా ఎంపిక చేయబడ్డ లక్కీ విన్నర్స్ కింద ఇవ్వబడిన ప్రైస్ లను పొందవచ్చు :-
    • నేషనల్ లెవెల్ విన్నర్స్ కు 1 కోటి రూపాయల విలువ గల 2 బంపర్ ప్రైసులు ఇవ్వబడును. (మూడు నెలలకు ఒకసారి)
    • Rs. 10,00,000/- విలువ గల 10 ప్రైజులు ప్రతి రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతానికి ఇవ్వబడును.
    • Rs. 10,000/- విలువ గల 800 ప్రైస్ లు ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి ఇవ్వబడును.

Mera Bill Mera Adhikaar Scheme Benefits.

అర్హత

  • మేరా బిల్ మేరా అధికార పథకం కింద లాభాలను పొందాలంటే భారత ప్రభుత్వం కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను కలిగి ఉండాలని తెలియజేసింది :-
    • లబ్ధిదారులు భారత పౌరులై ఉండాలి.
    • లబ్ధిదారుల దగ్గర చెల్లుబాటులో ఉన్న B2C GST బిల్లు ఉండాలి.
    • ఇన్వాయిస్ అమౌంట్ Rs. 200/- కు మించినుంచి ఉండాలి.
    • B2C GST బిల్లులో కింద ఇవ్వబడిన వివరాలు ఉండాలి :-
      • సప్లయర్ GST నంబర్.
      • ఇన్ వాయిస్ నెంబర్.
      • ట్యాక్స్ అమౌంట్.
      • టోటల్ బిల్ అమౌంట్.
      • రిసిపెంట్ పేరు.

అవసరమైన పత్రాలు

  • మేరా బిల్ మేరా అధికార పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రిజిస్ట్రేషన్ సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • మొబైల్ నెంబర్. ( తప్పనిసరి)
    • భారత ప్రభుత్వం చేత ఇవ్వబడిన ఐడెంటిటీ ప్రూఫ్.
    • ఒరిజినల్ GST బిల్లు.
    • పాన్ కార్డు.
    • బ్యాంకు ఖాతా వివరాలు.

అప్లై చేసే విధానం

  • మేరా బిల్ మేరా అధికార్ పథకానికి అప్లై చేసే పద్ధతి చాలా సులువు.
  • లబ్ధిదారులు GST బిల్లులను 2 పద్ధతుల ద్వారా అప్లోడ్ చేయవచ్చు.
  • మొదటి పద్ధతి మేరా బిల్ మేరా అధికార పథకం అధికారిక పోర్టల్ ద్వారా.
  • రెండో పద్ధతి మేరా బిల్ మేరా అధికార పథకం మొబైల్ యాప్ ద్వారా.
  • మేరా బిల్ మేరా అధికార్ పథకంలో బిల్లులను అఫీషియల్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలంటే, లబ్ధిదారులు పోర్టల్ ఓపెన్ చేయాలి.
  • ప్రతి లబ్ధిదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • మేరా బిల్ మేరా అధికార్ పథకం రిజిస్ట్రేషన్ ఫామ్ లో కింద ఇవ్వబడిన వివరాలను నింపాలి :-
    • మొదటి పేరు.
    • మధ్య పేరు.
    • చివరి పేరు.
    • మొబైల్ నెంబర్.
    • రాష్ట్రం పేరు.
  • కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత, పోర్టల్ లబ్ధిదారుల నెంబర్కు OTP మీ పంపి ధ్రువీకరిస్తుంది.
  • OTP వెరిఫికేషన్ తర్వాత, లబ్ధిదారులు మేరా బిల్ మేరా అధికార్ పథకానికి రిజిస్టర్ అవుతారు.
  • రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా, లబ్ధిదారులు మేరా బిల్ మేరా అధికార్ పథకం పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ చేసే సమయంలో, పథకం పోర్టల్ మరొకసారి లబ్ధిదారుల మొబైల్ నెంబర్ను OTP వెరిఫికేషన్ ద్వారా ధ్రువీకరిస్తుంది.
  • OTPవెరిఫికేషన్ తర్వాత, స్క్రీన్ మీద కింద ఇవ్వబడిన విండో ఓపెన్ అవుతుంది.
    Mera Bill Mera Adhikaar Scheme Bill Upload Window
  • మేరా బిల్ మేరా అధికార్ పథకం పోర్టల్ లో, GST బిల్లును అప్లోడ్ చేయడానికి అప్లోడ్ ఇన్ వాయిస్ మీద క్లిక్ చేయాలి.
  • లబ్ధిదారులు అత్యధికంగా ప్రతి నెలకు 25 GST బిల్లుల వరకు అప్లోడ్ చేయవచ్చు.
  • మరొక పద్ధతిలో, GST బిల్లులను మేరా బిల్ మేరా అధికార పథకం మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయవచ్చు.
  • మేరా బిల్ మేరా అధికార పథకం మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది.
  • ఈ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అఫీషియల్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న పద్ధతి మొబైల్ యాప్ లో రిజిస్ట్రేషన్ పద్ధతి ఒకటే.
  • రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, మీరా బిల్ మేరా అధికార పథకం మొబైల్ యాప్ లో లాగిన్ చేసి GST బిల్లులను అప్లోడ్ చేయాలి.
  • మేరా బిల్ మేరా అధికార పథకంలో ఎంపిక చేయబడ్డ లక్కీ విన్నర్స్ ప్రతినెల 15వ తారీఖున ప్రకటించబడతారు.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ హెల్ప్ లైన్ నెంబర్ :- 18001034786.
Person Type Govt

Comments

వ్యాఖ్య

Sir mene account me naam me correction nhi ho rha tha to mene account delete kr diya . Or abhi same mobile number se account create nhi kr pa rhi hu so what can I do

స్థిరలంకె

వ్యాఖ్య

I m from Gujarat. Mere account me naam correction nhi ho rha tha so mene account dlt kr diya so same mobile number se sine up nhi ho rha h . What can I do ?

వ్యాఖ్య

👌🙏Telangana ఈ ఐడియా నాకు ముందే వచ్చింది ఈ ఐడియా అమల్ లోకి తెచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను చిన్న రిక్వెస్ట్ ప్రైజ్ మనీ అంకెలు పెంచండి మేరా బిల్ మేరా అధికార్ ఐడియా నుంచి గవర్నమెంట్ కి ఎక్కువ డబ్బు కేంద్రీకృతం అవుతుంది సరైన జీఎస్టీ కడితే దేశం అభివృద్ధి చెందుతుంది అవినీతి ఉండదు All india లో త్వరగా చేయండి👍🇮🇳

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.