తెలంగాణ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • కారు కొనుగోలు మొత్తం ధరపై 60% సబ్సిడీ లేదా అత్యధికంగా Rs. 5,00,000/- ఇవ్వబడును. (రెండింటిలో తక్కువ ఉన్న అమౌంటు ఇవ్వబడును)
  • దరఖాస్తుదారులు సొంతంగా Rs. 50,000/- వెచ్చించాలి.
  • మిగిలిన కారు ధర బ్యాంకులోను ద్వారా అందజేయబడుతుంది.
Customer Care
  • తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ ఈమెయిల్ :- helpdesk.obms@cgg.gov.in.
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23244501.
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- tsmfcinfo@gmail.com.
  • తెలంగాణ షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23315970.
  • తెలంగాణ షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :-
    • md_tgsccfc@telangana.gov.in.
    • mdtgsccfc@gmail.com.
  • తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23317126.
  • తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగం హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- ctwtgs@gmail.com.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం.
లబ్ధిదారులు SC/ ST/ BC/ తెలంగాణ మైనారిటీ యువత.
లాభాలు కారు కొనుగోలుపై, Rs.5 లక్షల వరకు 60% సబ్సిడీ ఇవ్వబడును.
నోడల్ విభాగాలు
  • మైనారిటీ విభాగం, తెలంగాణ.
  • గిరిజన సంక్షేమ విభాగం, తెలంగాణ.
  • షెడ్యూల్ క్యాస్ట్ విభాగం, తెలంగాణ.
  • వెనుకబడిన తరగతి విభాగం, తెలంగాణ.
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం అప్లికేషన్ ఫామ్

పరిచయం

  • డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన, స్వయం ఉపాధిని కల్పించే ప్రోగ్రాం.
  • తెలంగాణ యువతకు మద్దతు కల్పించి, స్వయం ఉపాధిని అందజేయడమే, తెలంగాణ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం.
  • ఈ ప్రోగ్రాంను “తెలంగాణ సొంత కారు పథకం” లేదా “తెలంగాణ మీ సొంత కారు నడిపే పథకం” అని కూడా అంటారు.
  • కారు కొనుగోలు చేసి టాక్సీ లాగా ఉపయోగించుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వం, లబ్ధిదారులకు సబ్సిడీని అందజేస్తుంది.
  • SBI బ్యాంకు, మారుతి మోటార్స్, ఉబర్ క్యాబ్ సర్వీస్ సహాయం ద్వారా, తెలంగాణలో డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం అమలు పరచబడుతుంది.
  • లబ్ధిదారులు, టాక్సీ సర్వీస్ ద్వారా జీవనోపాధి పొందడానికి, కొనుగోలు చేయబడిన కారును, ఉబర్ క్యాబ్ సర్వీస్ తో అనుసంధానం చేయాలి.
  • తెలంగాణ ప్రభుత్వం, కారు కొనుగోలుపై అత్యధికంగా Rs. 5,00,000/- వరకు, 60% సబ్సిడీని అందజేస్తుంది.
  • డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద, టాక్సీ లాగా ఉపయోగించుకోవడానికి, లబ్ధిదారులు కింద ఇవ్వబడిన కారులను ఎంపిక చేసుకోవచ్చు :-
    • Etios. (Sedan)
    • Etios Liva. (Hatchback)
    • Maruti Dzire Tour S.
    • Tata Zest.
    • Tata Bolt.
    • Hyundai Xcent.
    • Hyundai I10.
    • Mahindra Verito. (Sedan)
    • Mahindra Verito Vibe. (Hatchback)
    • Honda Amaze.
  • లబ్ధిదారులు కూడా సొంతంగా, Rs. 50,000/- లను ఉపయోగించి సహకరించాలి.
  • మిగిలిన డబ్బు, లబ్ధిదారులకు బ్యాంకు లోన్ ద్వారా ఇవ్వబడును.
  • SC/ ST/ BC మరియు మైనారిటీ వర్గానికి చెందిన, 21 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మాత్రమే తెలంగాణ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంకు అర్హులు.
  • ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులందరూ కచ్చితంగా, మారుతీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా, డ్రైవింగ్ ట్రైనింగ్ ను పూర్తి చేయాలి.
  • సబ్సిడీ డబ్బు, సంబంధిత కార్పొరేషన్ చేత బ్యాంకుకు ప్రత్యక్షంగా విడుదల చేయబడుతుంది.
  • అప్పుడు బ్యాంకు సబ్సిడీ అమౌంట్ ను మరియు లోన్ అమౌంట్ ను, Maruti Suzuki కారు కొనుగోలుకు విడుదల చేస్తుంది.
  • డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ కింద ఇవ్వబడిన సభ్యులను కలిగి ఉంటుంది :-
    • డిస్ట్రిక్ట్ కలెక్టర్.
    • డి ఎం డబ్ల్యూ ఓ.
    • డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్.
    • బ్యాంకు ఎల్డీఎం.
    • ఉబర్.
  • అర్హత కలిగిన లబ్ధిదారులు, తెలంగాణ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద కారు కొనుగోలుకై సబ్సిడీ పొందడానికి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి అప్లై చేయవచ్చు.

పథకం లాభాలు

  • కారు కొనుగోలు మొత్తం ధరపై 60% సబ్సిడీ లేదా అత్యధికంగా Rs. 5,00,000/- ఇవ్వబడును. (రెండింటిలో తక్కువ ఉన్న అమౌంటు ఇవ్వబడును)
  • దరఖాస్తుదారులు సొంతంగా Rs. 50,000/- వెచ్చించాలి.
  • మిగిలిన కారు ధర బ్యాంకులోను ద్వారా అందజేయబడుతుంది.

అర్హత

  • దరఖాస్తుదారులు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • దరఖాస్తుదారులు 8వ తరగతి పాసై ఉండాలి.
  • దరఖాస్తుదారుల వయస్సు 21 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
  • దరఖాస్తుదారులకు ఎల్ ఎన్ వి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • దరఖాస్తుదారుల సంవత్సరం కుటుంబ ఆదాయం కింద ఇవ్వబడినంత ఉండాలి :-
    • గ్రామీణ ప్రాంతాలలో Rs. 1,50,000/-.
    • పట్టణ ప్రాంతాలలోRs. 2,00,000/-.
  • దరఖాస్తుదారులు కింద ఇవ్వబడిన క్యాస్ట్ కు చెంది ఉండాలి :-
    • షెడ్యూల్ తెగలు.
    • షెడ్యూల్ క్యాస్ట్.
    • మైనారిటీ.
    • వెనుకబడిన తరగతి.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం.
  • ఆధార్ కార్డు.
  • మీసేవ ఇన్కమ్ సర్టిఫికెట్.
  • చదువు సంబంధిత సర్టిఫికెట్.
  • పాన్ కార్డ్.(తప్పనిసరి కాదు)
  • మీసేవ క్యాస్ట్ సర్టిఫికెట్.
  • డ్రైవింగ్ లైసెన్స్.
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో.

అప్లై చేయు విధానం

ప్రోగ్రాం అప్లికేషన్ ఫ్లో

Telangana Driver Empowerment Programme Application Flow

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ ఈమెయిల్ :- helpdesk.obms@cgg.gov.in.
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23244501.
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- tsmfcinfo@gmail.com.
  • తెలంగాణ షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23315970.
  • తెలంగాణ షెడ్యూల్ తెగల సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :-
    • md_tgsccfc@telangana.gov.in.
    • mdtgsccfc@gmail.com.
  • తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23317126.
  • తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగం హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- ctwtgs@gmail.com.

Comments

In reply to by D kishan (సరిచూడ బడలేదు)

స్థిరలంకె

వ్యాఖ్య

కారు లోను కావలి సబ్సిడీ

స్థిరలంకె

వ్యాఖ్య

నేను షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని 2009 సంవత్సరం నుండి ఎస్సీ సబ్సిడీ కార్ లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నాను. ఇంకో మూడు సంవత్సరాల వరకే ఛాయిస్ ఉన్నది తర్వాత 40 సంవత్సరాలు వస్తాయి. దయచేసి ఈ సంవత్సరం అన్న నాకు లోను మంజూరు చేయాలని మనవి చేసుకుంటున్నాను. యాదాద్రి జిల్లా

స్థిరలంకె

వ్యాఖ్య

సబ్సిడీ కార్ టాక్సీ కోసం 2009 సంవత్సరం నుండి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను ఇంతవరకు నాకు అమలు కావట్లేదు దయచేసి ఈ సంవత్సరమైనా అమలు చేయాలని వేడుకుంటున్నాను. వయసు 37 సంవత్సరాలు. మూడు సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవడానికి వీలుండదు దయచేసి సాంక్షన్ చేయండి

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format