తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద తెలంగాణ లోని నిరాశ్రయులకు మరియు సొంత భూమిలేని వారికి, కింద ఇవ్వబడిన లాభాలు ఇవ్వబడును :-
    • ఇల్లు నిర్మాణానికి కావాల్సిన భూమిని ఉచితంగా ఇవ్వబడును.
    • ఇల్లు నిర్మాణానికి Rs. 5,00,000/- ఆర్థిక సహకారం ఇవ్వబడును.
    • తెలంగాణ ఉద్యమకారులకు మరియు సమరయోధులకు 250 చదరపు గజాల భూమి ఇవ్వబడును.
Customer Care
  • తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం.
లాభాలు
  • ఇల్లు కోసం భూమి ఉచితంగా ఇవ్వబడును.
  • ఇల్లు నిర్మాణానికి Rs. 5 లక్షలు ఇవ్వబడును.
  • ఉద్యమకారులకు 250 చదరపు గజాల ప్లాటు ఇవ్వబడును.
లబ్ధిదారులు
  • నిరాశ్రయులు మరియు భూమిలేని ప్రజలు.
  • తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు/సమరయోధులు.
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు.
సబ్స్క్రైబ్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరుగుతాయి.
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓటర్ల మన్నన పొంది రాబోయే ఎన్నికలలో గెలవడం కోసం తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రకటించింది.
  • అమలుపరచిన తర్వాత, ఇందిరమ్మ ఇల్లు పథకం అత్యంత ప్రసిద్ధమైన మరియు సామాజికంగా అవసరమైన పథకం అవుతుంది.
  • నిరాశ్రయులకు మరియు సొంత భూమి లేని తెలంగాణ ప్రజలకు గృహాన్ని అందించడమే ఇందిరమ్మ ఇల్లు పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం. రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ పథకం అమలులోకి వస్తుంది.
  • ఈ పథకాన్ని “తెలంగాణ ఉచిత భూమి పంపిణీ పథకం” అని కూడా అంటారు.
  • అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు నిర్మాణానికి అవసరమైన భూమి ఉచితంగా ఇవ్వబడును.
  • ఇల్లు నిర్మాణానికి అవసరమైన భూమితో పాటు, ఇల్లు నిర్మించడానికి Rs. 5,00,000/- ఆర్థిక సహకారం ఇవ్వబడును.
  • ఇందిరమ్మ ఇల్లు పథకం, నిరాశ్రయులకు మరియు సొంత ఇల్లు లేని తెలంగాణ ప్రజలకు, తమ సొంతింటి కల సాకారం చేసుకోవడానికి సహాయపడుతుంది.
  • తెలంగాణ ఉద్యమకారులకు మరియు సమరయోధులకు కూడా ఇల్లు నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం లాభాలు వర్తిస్తాయి.
  • తెలంగాణ ఉద్యమకారులకు మరియు సమరయోధులకు 250 చదరపు గజాల భూమి ఉచితంగా ఇవ్వబడుతుంది.
  • కానీ తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ముందు చేసిన ప్రమాణం మాత్రమే.
  • భూమి మరియు ఇల్లు నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తరువాత మాత్రమే ఇవ్వబడుతుంది.
  • దానికి ముందు, నిరాశ్రయులు మరియు సొంత భూమిలేని తెలంగాణ ప్రజలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించాలి.
  • తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి మరిన్ని వివరాలు తెలియజేయబడలేదు.
  • కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గెలిచిన తర్వాత మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మాత్రమే ఈ పథకానికి అర్హత మరియు అప్లై చేసే విధానం తెలియజేయబడతాయి.
  • తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే ఇక్కడ పొందుపరుస్తాం.
  • ఇందిరమ్మ ఇల్లు పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి వివరాల కోసం ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద తెలంగాణ లోని నిరాశ్రయులకు మరియు సొంత భూమిలేని వారికి, కింద ఇవ్వబడిన లాభాలు ఇవ్వబడును :-
    • ఇల్లు నిర్మాణానికి కావాల్సిన భూమిని ఉచితంగా ఇవ్వబడును.
    • ఇల్లు నిర్మాణానికి Rs. 5,00,000/- ఆర్థిక సహకారం ఇవ్వబడును.
    • తెలంగాణ ఉద్యమకారులకు మరియు సమరయోధులకు 250 చదరపు గజాల భూమి ఇవ్వబడును.

Telangana Indiramma Indlu Scheme Benefits.

అర్హత

  • లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • లబ్ధిదారులు నిరాశ్రయులు మరియు సొంత భూమి లేని వారై ఉండాలి.
  • తెలంగాణ ఉద్యమకారులు మరియు సమరయోధులు కూడా అర్హులు.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • సొంత భూమి మరియు ఇల్లు లేదని నిరూపించే పత్రం.
    • ఆధార కార్డు.
    • రేషన్ కార్డు.
    • మొబైల్ నెంబర్.

అప్లై చేసే విధానం

  • తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇల్లు లేని వ్యక్తుల కోసం మరియు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం కోరుకునే వారి కోసం తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు పథకం దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు పథకం దరఖాస్తు ఫారం ఉచితంగా క్రింద ఉన్న కార్యాలయంలో ఇస్తున్నారు :-
    • గ్రామ పంచాయితీ కార్యాలయం.
    • గ్రామ సభ కార్యాలయం.
    • మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం.
  • ఇందిరమ్మ ఇండ్లు పథకం దరఖాస్తు ఫారం తీసుకోగలరు.
  • దరఖాస్తు ఫారంలో మి వివరాల లైన్ పేరు, వయస్సు, కులం, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఇంటి సభ్యుల వివరాలను నింపగలరు.
  • ఇందిరమ్మ ఇండ్లు పథకం ఫారం ను ఇచ్చిన 6 హామీలలో ఎంచుకోండి.
  • కావలసిన పత్రాలను దరఖాస్తు ఫారంకి జతచేయండి.
  • తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు పథకం దరఖాస్తు ఫారంను అన్ని పత్రాలతో అదే కార్యాలయంలో సమర్పించండి.
  • సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తు ఫారంలోని వివరాలను మరియు పత్రాలను పరిశీలిస్తారు.
  • ఇందిరమ్మ ఇండ్లు పథకంకు అర్హులైన వారి లిస్టును అధికారులు తయారు చేస్తారు.
  • ఎంపిక అయినా వారికి ఇంటి కోసం భూమిని ఉచితంగా పొందుతారు, మరియు తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద తెలంగాణ ఉద్యమ కార్యకర్తకు ఇల్లు మరియు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వబడును.
  • కావలసిన వారు ఇందిరమ్మ ఇండ్లు పథకం దరఖాస్తు ఫారంను ఇచ్చిన గడువు సమయంలో అనగా 28-12-2023 నుంచి 06-01-2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు పథకం సంప్రదింపు వివరాలు, రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాతే తెలియజేయబడతాయి.

Comments

వ్యాఖ్య

I need a loan for my business I'm a very hard working girl I'm unmarried my age is 34 i wanna do something for my future I don't hav a owne house all so living in rent house. Request I want loan 10 lack for my business. I wanna open my sloun.

వ్యాఖ్య

3sarlu verification aina illu raledu inka enni samvatsarlu rent house lo vundalo, life end avaka mundu illostey chalu

వ్యాఖ్య

isari kooda aplly chesamu idhi enno saro kooda gurthuledhu illulu malaga nijanga lenivallaki ivvandi unnavallake vashthundhi nenu chalamandhi choosa apps feck mottham feck apllycetion feck asalu lenivallakante andhulo pani chese vallaku valla chuttalaku maku mathram radhu mosam chese vallandharu paisalakosam thappa nijanga jeetham kosam panichesevadu evadu ledu vestu gallu deeniki replly vashthe nenu anni sarlu ememi aplly chesano anni governament appso antha mosamo choopistha

వ్యాఖ్య

Sir, మేము గత 17సం"ల నుంచి హైదరాబాద్ జీడిమెట్ల లో కిరాయి ఇంట్లోనే ఉంటన్నాము.
2016లో double bedroom applyచేసాము.
ఐనప్పటికీ రాలేదు. ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు ఇచ్చారు. మన తెలంగాణవారికి ఇవ్వడం లేదు.
గమనించగలరని మనవి sir🙏

వ్యాఖ్య

Sir, మేము గత 17సం"ల నుంచి హైదరాబాద్ జీడిమెట్ల లో కిరాయి ఇంట్లోనే ఉంటన్నాము.
2016లో double bedroom applyచేసాము.
ఐనప్పటికీ రాలేదు. ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు ఇచ్చారు. మన తెలంగాణవారికి ఇవ్వడం లేదు.
గమనించగలరని మనవి sir🙏

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format