తెలంగాణ మహాలక్ష్మి పథకం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికలలో గెలిచిన తర్వాత, తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా, కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • అర్హత కలిగిన మహిళల లబ్ధిదారులకు, నెలకు, Rs. 2,500/- చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వబడును.
    • నెలకు, Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్ ఇవ్వబడును.
    • తెలంగాణ TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
Customer Care
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం సంప్రదింపు వివరాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలియజేయబడతాయి.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ మహాలక్ష్మి పథకం
లాభాలు
  • నెలకు Rs. 2,500/- ల ఆర్థిక సహకారం.
  • Rs. 500/- విలువ గల వంట గ్యాస్ సిలిండర్.
  • ఉచిత బస్సు ప్రయాణం.
లబ్ధిదారులు తెలంగాణ మహిళలు
నోడల్ విభాగం ఇంకా నియమించలేదు
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ మహాలక్ష్మి పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ డిసెంబర్ 3, 2023 న ప్రకటించబడింది.
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి త్వరలో ప్రభుత్వాన్ని నిర్మించనుంది.
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నిర్మిస్తే, తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుస్తామని తెలంగాణ మహిళలకు వాగ్దానం చేసింది.
  • కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగానే తెలంగాణలో కూడా ప్రకటించింది.
  • ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ వారు వాగ్దానం చేసిన విధంగా తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలుపరిచే సమయం వచ్చింది.
  • ఈ పథకాన్ని ఇతర పేర్ల ద్వారా, అంటే “తెలంగాణ మహాలక్ష్మి యోజన” లేదా “తెలంగాణ మహాలక్ష్మి పథకం” అని కూడా పిలుస్తారు.
  • తెలంగాణ ప్రభుత్వం యొక్క మహాలక్ష్మి పథకం ప్రాథమికంగా 3 సంక్షేమ పథకాల కలయిక :-
    • "తెలంగాణ మహాలక్ష్మి ఆర్థిక సహాయ పథకం".
    • "తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం".
    • "తెలంగాణ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం".
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా, తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా లాభాలను అందజేస్తుంది.
  • మహాలక్ష్మి పథకం కింద, అర్హులైన మహిళలకు, నెలకు, Rs. 2,500/- చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వబడుతుంది.
  • వివాహమైన, విడాకులైన, మరియు వితంతు మహిళలు తెలంగాణ మహాలక్ష్మి పథకానికి ముఖ్యమైన లబ్ధిదారులు.
  • ఈ ఆర్థిక సహకారంతో పాటు, ప్రతి నెల Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్ కూడా తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద, అర్హులైన మహిళలకు ఇవ్వబడుతుంది.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద, Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ తమ పేరు మీద చెల్లుబాటులో ఉన్నమహిళలందరికీ ఇవ్వబడుతుంది.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద, మహిళా లబ్ధిదారులు, తెలంగాణ రాష్ట్ర బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
  • తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం 9 డిసెంబర్ 2023న ప్రారంభించబడింది.
  • ఇప్పుడు తెలంగాణ మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు తెలంగాణ సరిహద్దు మీదుగా TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
  • తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద లబ్ధిదారులకు కండక్టర్ జీరో టిక్కెట్టు జారీ చేస్తారు.
  • మహిళా లబ్ధిదారులు TSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి మాత్రమే తెలంగాణ చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువును చూపించాలి.
  • ఉచిత బస్సు సదుపాయం, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోపల మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులలో మాత్రమే వర్తిస్తుంది.
  • మహాలక్ష్మి పథకం మరియు దాని లాభాలు త్వరలోనే అమలుపరచబడతాయి. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచింది మరియు త్వరలో తెలంగాణలో ప్రభుత్వాన్ని మరియు మొదటి క్యాబినెట్ ను నిర్మిస్తుంది.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు పరిచే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకోబడుతుంది.
  • కాబట్టి, తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద లాభాలను పొందడానికి మహిళల లబ్ధిదారులు మరికొంత సమయం వేచి ఉండాలి.
  • ప్రస్తుతానికి ఇంతకుమించి ఎటువంటి వివరాలు మాకు తెలియజేయబడలేదు.
  • మిగిలిన అర్హత పరిస్థితులు మరియు తెలంగాణ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసే పద్ధతి అధికారిక మార్గదర్శకాలా ద్వారా విడుదల చేయబడతాయి.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం గురించి మరిన్ని వివరాలు మాకు తెలియగానే, ఇక్కడ పొందుపరుస్తాం.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం లేదా తెలంగాణ ప్రభుత్వ ఇతర పథకాల గురించి ఉచితంగా వివరాలను పొందడానికి ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి లేదా ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

పథకం లాభాలు

  • కొత్తగా నిర్మించబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన మహిళ లబ్ధిదారులకు తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా, కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • అర్హత కలిగిన మహిళల లబ్ధిదారులకు, నెలకు, Rs. 2,500/- చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వబడును.
    • ప్రతి నెలకు, Rs. 500/- విలువ గల గ్యాస్ సిలిండర్ ఇవ్వబడును.
    • తెలంగాణ TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

Telangana Mahalakshmi Scheme Benefits.

అర్హత

  • కొత్తగా నిర్మించబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ మహాలక్ష్మి పథకం కింద లాభాలను పొందాలంటే కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను వివరించింది :-
    • లబ్ధిదారులైన మహిళలు తెలంగాణ నివాసులై ఉండాలి.
    • మహిళల లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
    • మహాలక్ష్మి పథకం యొక్క మరిన్ని అర్హత వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసే సమయంలో లేదా రిజిస్టర్ చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • ఆధార్ కార్డు.
    • రేషన్ కార్డు.
    • గ్యాస్ కనెక్షన్ రసీదు (గ్యాస్ సబ్సిడీ కొరకు)
    • బ్యాంకు ఖాతా వివరాలు.
    • ఆదాయ ధ్రువీకరణ పత్రం.
    • క్యాస్ట్ సర్టిఫికెట్ (సంబంధించిన వారికి మాత్రమే)
    • మొబైల్ నెంబర్.

అప్లై చేయు విధానం

  • మన అందరికీ  తెలిసిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసన సభ ఎన్నికలలో గెలిచింది.
  • కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం పరిపాలన మరియు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది.
  • 2023, డిసెంబర్ 8 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
  • ప్రస్తుతo TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించడం ద్వారా మహాలక్ష్మి ఉచిత పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.
  • మహాలక్ష్మి ఆర్ధిక సహాయ పథకం మరియు మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడి పతకం కోసం మహిళల నిరీక్షణ ముగిసింది.
  • తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారంను విడుదల చేసింది.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారాన్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
  • క్రింద పెరుకోబడిన వివరములను తెలంగాణ మహాలక్ష్మి దరఖాస్తు ఫారంలో నింపగలరు :-
    • పేరు.
    • కులం.
    • మొబైల్ నంబర్.
    • ఇంటి సభ్యుల వివరములు.
    • చిరునామా.
    • బ్యాంకు ఖాతా వివరాలు.
  • తెలంగాణ మహాలక్ష్మి ఆర్ధిక సహాయ పథకం మరియు తెలంగాణ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడి పథకలపై టిక్ చేయగలరు.
  • కావలసిన పత్రాలను దరఖాస్తు ఫారంకు జత చేయండి.
  • ఇప్పుడు మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారంను అన్ని పాత్రలతో గ్రామసభ కార్యాలయం/ గ్రామ పంచాయితీ కార్యాలయం/ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించండి.
  • సంబంధిత అధికారులు మహాలక్ష్మి పథకం దరఖాస్తు ఫారంను మరియు పత్రాలను పరిశీలిస్తారు.
  • తెలంగాణ మహాలక్ష్మి పథకంకు అర్హులైన లబ్ధిదారుల లిస్టును అధికారులు తయారు చేస్తారు.
  • ఎంపికైన లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం రూ.2500/- అందుతుంది మరియు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద గ్యాసు సిలిండర్ పై సబ్సిడీ పడుతుంది.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • కాంగ్రెస్ పార్టీ మొదటి క్యాబినెట్ మీటింగ్ లో తెలంగాణ మహాలక్ష్మి పథకాన్ని అమలు పరచడాన్ని అప్రూవ్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహాలక్ష్మి పథకం సంప్రదింపు వివరాలను తెలియజేస్తుంది.

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format