తెలంగాణ మీ సొంత ఆటో పథకం

Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • 3 వీలర్ ఆటో కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వబడును.
  • త్రీ వీలర్ వాహనం అసలు ధరపై 50 శాతం సబ్సిడీ ఇవ్వబడును.
  • మిగిలిన 50% ధరకు బ్యాంకులోను మంజూరు చేయబడును.
Customer Care
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23244501.
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- tsmfcinfo@gmail.com.
  • తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ ఈమెయిల్ :- helpdesk.obms@cgg.gov.in.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ మీ సొంత ఆటో పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2015.
లబ్ధిదారులు తెలంగాణ మైనారిటీ యువకులు.
లాభాలు 3 వీలర్ ఆటో కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ.
నోడల్ విభాగం మైనారిటీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం.
సబ్స్క్రిప్షన్ పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అప్లై చేయు విధానం తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • సొంత ఆటో పథకం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రముఖమైన ఉపాధి కల్పన పథకం.
  • ఇది 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది.
  • తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ విభాగం ఈ పథకం యొక్క నోడల్ విభాగం.
  • మైనారిటీ యువకులకు సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడమే తెలంగాణ సొంత ఆటో పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఏరియా (GHMC) లోని చాలా ప్రదేశాలలో మైనారిటీ కి చెందిన చదువుకున్న యువత ఆటోరిక్షాలు నడుపుతున్నారు.
  • అందులో చాలామందికి సొంత ఆటోలు లేవు. వారు ఆటోలను అద్దెకు తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు.
  • ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం 3 వీలర్ ఆటో కొనుగోలుపై 50% సబ్సిడీ అందిస్తుంది.
  • త్రీ వీలర్ కొనుగోలుపై, మిగిలిన 50 శాతం ఖర్చుకు, లోను సౌకర్యం కూడా కలదు.
  • కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (CNG) లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) మీద నడిచే మూడు సీట్ల సౌకర్యం కలిగిన త్రి వీలర్ వాహనాల కొనుగోలు పై మాత్రమే ఈ సబ్సిడీ లభించును.
  • సొంత ఆటో పథకం కింద సబ్సిడీ పొందడానికి, లబ్ధిదారులు కింద ఇవ్వబడిన ఆటో రిక్షాలపై అప్లై చేయ వచ్చును :-
    ఆటో కంపెనీ మోడల్
    TVS
    • TVS KING 4S CNG ELECTRIC START.
    • TVS KING 4S LPG ELECTRIC START.
    BAJAJ
    • RE-COMPACT CNG 2S.
    • RE-COMPACT LPG 2S.
    PIAGGIO
    • APE CITY CNG (4 STROKE).
    • APE CITY LPG (4 STROKE).
  • మైనారిటీ కమ్యూనిటీ చెందిన, 21 - 55 సంవత్సరాల వయసు కలిగిన వారు, తెలంగాణ సొంత ఆటో పథకం కింద ఆటో రిక్షా కొనుగోలుకై అర్హులు.
  • దరఖాస్తుదారుల కుటుంబ సంవత్సర ఆదాయం Rs. 2,00,000/- కన్నా తక్కువ ఉండాలి.
  • లోను వడ్డీ రేటు బ్యాంకు వడ్డీ రేటును బట్టి ఉంటుంది.
  • సబ్సిడీకి అప్లై చేయు సమయంలో దరఖాస్తుదారులకు చెల్లుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • CNG మరియు LPG ఆటో రిక్షాలపై మాత్రమే తెలంగాణ సొంత ఆటో పథకం కింద సబ్సిడీ ఇవ్వబడుతుంది.
  • అర్హులైన లబ్ధిదారులు ఆటో రిక్షా కొనుగోలుపై సబ్సిడీ కోసం తెలంగాణ మీ సొంత ఆటో పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.

పథకం లాభాలు

  • 3 వీలర్ ఆటో కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వబడును.
  • త్రీ వీలర్ వాహనం అసలు ధరపై 50 శాతం సబ్సిడీ ఇవ్వబడును.
  • మిగిలిన 50% ధరకు బ్యాంకులోను మంజూరు చేయబడును.

అర్హత

  • దరఖాస్తుదారులు తెలంగాణ నివాసులై ఉండాలి.
  • దరఖాస్తుదారులకు 3 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • దరఖాస్తుదారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నివసిస్తూ ఉండాలి.
  • దరఖాస్తుదారులు కింద ఇవ్వబడిన మైనారిటీ వర్గానికి చెందిన వారై ఉండాలి :-
    • ముస్లింలు.
    • బుద్ధులు.
    • సిక్కులు.
    • పార్శీలు.
    • క్రిస్టియన్లు.
    • జైన్లు.
  • దరఖాస్తుదారుల వయస్సు 21 నుండి 55 మధ్యలో ఉండాలి.
  • దరఖాస్తుదారుల కుటుంబ సంవత్సర ఆదాయం Rs. 2,00,000/- కు మించి ఉండరాదు.

అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు.
  • 3 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్.
  • 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్.
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం.
  • బ్యాంకు ఖాతా వివరములు.
  • నివాస ధ్రువీకరణ కోసం కింద ఇవ్వబడిన ఏదో ఒక పత్రం :-
    • రేషన్ కార్డు.
    • డ్రైవింగ్ లైసెన్స్.
    • ఓటర్ ID కార్డు.
    • ఆధార్ కార్డు.
    • బ్యాంకు పాస్ బుక్.

అప్లై చేయు విధానం

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23244501.
  • తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- tsmfcinfo@gmail.com.
  • తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ ఈమెయిల్ :- helpdesk.obms@cgg.gov.in.
  • రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ,
    5th ఫ్లోర్, హజ్ హౌస్,
    నాంపల్లి, హైదరాబాద్.
    500001.

Comments

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.

Rich Format